DRDO: భారత వైమానిక దళంలోకి యాంటీ డ్రోన్ వ్యవస్థ 5 d ago

నేటి ఆధునిక యుగంలో డ్రోన్లు యుద్ధ రంగంలో కీలకంగా మారాయి.2021లో జమ్మూ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై జరిగిన డ్రోన్ దాడినే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. అయితే భవిష్యత్తులో భారత్ కు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా సమర్థంగా డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకే భారత వైమానిక దళం యాంటీ డ్రోన్ వ్యవస్థ(డీ4)ను ఆవిష్కరించింది. దేశ సరిహద్దుల్లోని ప్రధాన ప్రాంతాల్లో (డీ4) దీనిని ఏర్పాటుచేస్తుంది. దీనిని డీఆర్డీవో అభివృద్ధి చేసింది.
డ్రోన్ గుర్తింపు, అడ్డగింత, నాశనం ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న డీ4 ఇప్పటివరకు మన సరిహద్దుల వద్ద ఉన్న బలహీన పరిస్థితులను అధిగమిస్తుంది. ఈ ప్రాజెక్టు అనేక స్థాయిలుగా ఉంటుంది. వివిధ సాంకేతిక పరిజ్ఞానాల ఏకీకరణతో ఈ ప్రాజెక్టును రూపొందించారు. ముఖ్యంగా యాంటీ డ్రోన్ వ్యవస్థలో రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు, రాడార్ అండ్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్, కృత్రిమ మేధ ఆధారిత ముప్పు వర్గీకరణ, ఎలక్ట్రానిక్ జామింగ్ అండ్ స్పూఫింగ్, హార్డ్ కిల్ అండ్ సాఫ్ట్ కిల్ న్యూట్రలైజేషన్ వంటి సాంకేతికతలను పొందుపరిచారు.